ఇటీవల టాలీవుడ్(Tollywood) లో రీ రిలీజ్(Re Release)ల హడావిడి ఎక్కువైన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం క్రితం ఏదైనా హీరోల స్పెషల్ డేస్ కి లేదా సినిమా వచ్చి కొన్నేళ్లు అయినందుకో రీ రిలీజ్ లు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వారానికి ఒక సినిమా రీ రిలీజ్ ఉంటుంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ ల హడావిడి ఎక్కువైంది. ఇక అభిమానులు కూడా మరీ పిచ్చిగా యూట్యూబ్ లో దొరికే సినిమాలకు కూడా థియేటర్స్ కి వెళ్లి హడావిడి చేయడంతో దొరికిందే ఛాన్స్ అని సినిమా వాళ్ళు ఫ్లాప్ సినిమాలతో సహా దొరికిన సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు.
ఇక ఈ ఆగస్టులో రీ రిలీజ్ ల సంఖ్య మరీ పెరిగిందే. ఇప్పటికే బిజినెస్ మెన్(Businessman) సినిమా రీ రిలీజ్ అవ్వగా యోగి, రఘువరన్ Btech, డీజే టిల్లు, 7/G బృందావన కాలనీ.. సినిమాలు రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గుడుంబా శంకర్(Gudumba Shankar) సినిమా రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు నాగబాబు. ఇప్పటికే నాగబాబు జల్సా, ఆరెంజ్ సినిమాలని రీ రిలీజ్ చేసి వాటికి వచ్చిన కలెక్షన్స్ ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చారు.
తాజాగా నాగబాబు గుడుంబా శంకర్ రీ రిలీజ్ గురించి ప్రకటిస్తూ.. ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. “గుడుంబా శంకర్”ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము. “జల్సా” మరియు “ఆరెంజ్” టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని జనసేన(Janasena) పార్టీ ఫండ్‌కి అంకితం చేయబడుతుంది. అలాగే అధికారిక పోస్టర్ వివరాలు త్వరలో తెలిపుతాము అని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు గుడుంబా శంకర్ సినిమాని థియేటర్స్ లో మరోసారి ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు.
Also Read : Chiranjeevi : భోళా శంకర్ కు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్..?