Balagam: అమ్మనాన్నలు దత్తత ఇచ్చారు.. కొమురయ్య కూతురు ఏం చెప్పిందంటే..?

ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ ఏ రేంజ్ లో హీట్ అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి పల్లెటూర్లలో కూడా పెద్ద తెరలను ఏర్పాటు చేసుకుని సినిమా చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 04 23 At 21.08.40

Whatsapp Image 2023 04 23 At 21.08.40

Balagam: ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ ఏ రేంజ్ లో హీట్ అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి పల్లెటూర్లలో కూడా పెద్ద తెరలను ఏర్పాటు చేసుకుని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చూసి ఎప్పటినుంచో గొడవలు, వివాదాలు కారణంగా విడిపోయిన కుటుంసభ్యులు, బంధువులు కూడా ఒక్కటవుతున్నారు. ఇటీవల చాలా గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా వివాదాల కారణంగా విడిపోయిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు ఈ సినిమా చూసి కలిసిపోయారు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

అయితే ఈ సినిమాలో నటించినవారందరూ కూడా చిన్న చిన్న నటులే. ఈ సినిమాతో అందరూ ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. బలగం సినిమా తమకు మంచి పేరు తెచ్చి పెట్టిందని అంటున్నారు. బలగం ఈ సినిమా హీట్‌తో ఈ సినిమాలో నటీనటులతో చాలా యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మి తాజాగా ఓ యూట్యూట్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తమ తల్లిదండ్రులకు తాము ఆరుగులు సంతానమని, తాను మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడే ఎకనామిక్స్ ప్రొఫెసర్‌కు దత్తత ఇచ్చారని చెప్పారు. దాంతో చిన్నప్పటి నుంచి తాను కన్న తల్లిదండ్రులకు దూరంగా పెరిగానని, తనను పెంచిన తండ్రే తన ప్రపంచమని తెలిపింది. ఈ రోజు తాను ఇలా ఉన్నానంటే తనను పెంచిన తండ్రే కారణమని స్పష్టం చేసింది. తనకు 15 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారని, అప్పుడే తన కన్న తల్లి చనిపోయినట్లు రూపలక్షి చెప్పుకొచ్చింది.

బాల్యంలో తాను ప్రేమకు బంధుత్వానికి దూరమయ్యానని, తన జీవితంలో ప్రస్తుతం తనకు ఉన్న ఏకైక సంతోషం దత్తత తండ్రి అని తెలిపింది. తాను 19 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆయన దూరమయ్యారని, జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నందుకే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నానని తెలిపింది.

  Last Updated: 23 Apr 2023, 09:20 PM IST