Site icon HashtagU Telugu

Tollywood Debutes 2022: టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్స్ వీళ్లే!

Tollywood debutes

Tollywood

సినిమా (Tollywood) ఓ రంగుల ప్రపంచం. ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ తమ అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంతోమంది స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. కానీ కొందరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మొదటి ప్రయత్నంలోనే సినిమా ఆఫర్లను కొల్లగొడుతారు. అందుకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా కారణం కావొచ్చు. ప్రతి ఏడాది ఎంతోమంది తారలు టాలీవుడ్ కు పరిచయమవుతూనే ఉన్నారు. 2022లో ఎంతమంది హీరోలు, హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు? ఎంతవరకు రాణించారు? అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదువాల్సిందే

బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh)

బెల్లంకొండ గణేష్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు. బెల్లంకొండ గణేష్ తొలిసారిగా థియేటర్లలోకి వచ్చిన చిత్రం “స్వాతి ముత్యం”. తాజాగా ‘నేను స్టూడెంట్‌ సర్‌’ అనే మరో సినిమాతో రాబోతున్నాడు. స్వాతిముత్యం సినిమాతో ఒకే అనిపించుకున్నాడు.

అశోక్ గల్లా (Ashok Galla)

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ హీరో అశోక్ గల్లా. శ్రీరామ్ ఆదిత్య రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీరో” మూవీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అశోక్ గల్లాకు రాజకీయవేత్త. పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా సపోర్ట్ ఉంది. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. కానీ అనుకున్నంత మేరకు రాణించలేకపోయాడు. ఆ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

ఆశిష్ (Ashish)

అనుపమ పరమేశ్వరన్ సరసన “రౌడీ బాయ్స్”తో అరంగేట్రం ఇచ్చాడు అశిష్. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఈ యువహీరోకు దిల్ రాజు సపోర్ట్ ఉండటంతో పలు సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

షిర్లీ సెటియా (Sherly)

మొదటి సినిమాతో కుర్రకారును ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. ఒక భారతీయ చలనచిత్ర నటి, బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో  హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

మానుషి చిల్లర్ (Manushi chillar)

ఈమె మాజీ ప్రపంచ సుందరి. ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో నటించిన పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తో అట్రాక్ట్ చేస్తోంది.

Also Read : Salman Khan Fans: కట్టలు తెంచుకున్న అభిమానం.. సల్మాన్ అభిమానులపై లాఠీచార్జి!