Japan Jakkanna : జపాన్ బామ్మ ప్రేమకు జక్కన్న ఎమోషనల్‌

Japan Jakkanna : జపాన్‌లో మన జక్కన్నకు క్రేజ్ మామూలుగా లేదు.

Published By: HashtagU Telugu Desk
Japan Jakkanna

Japan Jakkanna

Japan Jakkanna : జపాన్‌లో మన జక్కన్నకు క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం భార్య రమ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్న దిగ్గజ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి 83 ఏళ్ల జపనీస్ వృద్ధురాలు స్వయంగా చేతులతో చేసిన ఒక స్పెషల్‌ పోస్టర్‌ను కానుకగా ఇచ్చింది.ఆ బామ్మతో దిగిన ఫొటోలను రాజమౌళి తన ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు. జసనీయుల వీరాభిమానికి ఆయన ఉప్పొంగిపోయారు. ‘‘జపాన్‌ ప్రజలు తమ ప్రియమైన వారు ఆనందంగా, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఓరిగామ్‌ క్రేన్‌లతో తయారు చేసిన బహుమతులను ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. 83ఏళ్ల పెద్దావిడ 1000 ఓరిగామి క్రేన్‌లను ఒక చోట కూర్చి  ప్రత్యేకమైన కానుకను అందించి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఆమెను ఆకట్టుకుందని మాకు చెప్పారు.  ఈ కానుకను అందించేందుకు రాత్రి చలిలో మా కోసం ఆమె చాలాసేపు వెయిట్‌ చేశారట. ఇలాంటి అభిమానం, ప్రేమలు వెలకట్టలేనివి. కృతజ్ఞత చూపించడం తప్ప.. వాళ్లకు తిరిగి ఏం చెల్లించగలం’’ అంటూ జక్కన్న ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.  ప్రస్తుతం ఆయన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

We’re now on WhatsApp. Click to Join

జక్కన్న(Japan Jakkanna) దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ’’ జపాన్‌ థియేటర్‌లలో మళ్లీ స్క్రీనింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. RRR మూవీ జపనీస్ భాషలో విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా అక్కడి థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ షో లను వేశారు. అందుకే రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి జపాన్‌‌కు వెళ్లారు. టోక్యోలో RRR స్పెషల్ షోలు వేస్తున్న థియేటర్లలో తన కుటుంబంతో కలిసి జక్కన్న సందడి చేశారు. ఈ సందర్భంగా మూవీ షూటింగ్‌‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను జపాన్‌ ఆడియన్స్‌తో పంచుకున్నారు. షూటింగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో తనకున్న ఫన్నీ ఎక్స్ పీరియన్స్‌లను షేర్ చేసుకున్నారు. అల్రెడీ విడుదలైన సినిమాను కూడా మళ్లీ థీయేటర్లో ఇంతగా ఆదరిస్తున్న జపాన్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read :Brother Weds Sister : అన్నాచెల్లెళ్ల పెళ్లి.. గవర్నమెంట్ డబ్బుల కోసం కక్కుర్తి

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట కొరియోగ్రఫీకి హాలీవుడ్‌ దిగ్గజాలు కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీ ఆస్కార్‌ గెలవడంతో నాటు నాటు క్రేజ్‌ ఇంటర్నేషనల్‌ వేదికలపై మార్మోగింది. ఇప్పటికీ ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్టెప్పులేస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ బాబు పాన్‌ వరల్డ్‌ చిత్రం SSMB29ను తెరకెక్కించబోతున్నారు.

  Last Updated: 19 Mar 2024, 08:17 AM IST