Site icon HashtagU Telugu

Actor Govinda: విడాకుల వార్తలపై మొదటిసారి అలా స్పందించిన నటుడు గోవిందా.. ఆయన రియాక్షన్ ఇదే?

Actor Govinda

Actor Govinda

బాలీవుడ్ పాపులర్ జోడి అయిన గోవింద, సునీత అహుజా గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ జోడీస్ లో ఈ జంట కూడా ఒకరు. వీరు దాదాపుగా 37 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరి వైవాహిక బంధం బీటలు బారిందని విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి గోవింద దంపతులు స్పందించకపోవడంతో ఆ వార్తలు మరింత ఉపందుకున్న విషయం తెలిసిందే.

అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా అన్నటుడు గోవిందా స్పందించారు. కాగా ఈ మేరకు ఆయన విడాకుల వార్తలపై స్పందిస్తూ.. కొద్దిరోజుల నుంచి మా ఇంటికి కొంతమంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడడం కోసం మాత్రమే మా ఇంటికి వచ్చారు. అలాగే నేను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల వారందరూ వస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్‌ ఇలా చెప్పాడు. ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు.

ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోవిందా చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొద్ది రోజుల క్రితం గోవింద సతీమణి సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను గోవింద వేరువేరుగా ఉంటున్నాము. మా పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాము అని ఆమె తెలిపారు. అంతేకాకుండా వచ్చే జన్మంటూ ఉంటే ఆయనకు భార్యగా మాత్రం కోరుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారు. ఇలా ఆమె ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి విడాకుల వార్తల సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఇప్పటికైనా ఈ వార్తలకు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి మరి.