Site icon HashtagU Telugu

Padma Bhushan : బాలకృష్ణ ను పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ప్రభుత్వం

Balakrishna Padmabhushan

Balakrishna Padmabhushan

నందమూరి అభిమానులకు (Nandamuri fans) తీపి కబురు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను పద్మ భూషణ్ (Padma Bhushan) కి ఏపీ ప్రభుత్వం నామినేట్ (Nominated by AP Govt) చేసింది. ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డుకు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేరును ఎంపిక చేసి కేంద్రానికి ఏపీ సర్కార్ పంపించబోతుంది. బాలయ్యతో పాటు, సీనియర్ నటుడు మురళీమోహన్ పేరు కూడా సిఫార్సు చేయబడుతున్నట్లు సమాచారం.

టీడీపీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉన్నందున, బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు అందించబోతున్నారని సమాచారం చాలా బలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై త్వరలో అధికార ప్రకటన చేయనున్నారు. ఈ అవార్డు బాలకృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాల్లో చేసిన కృషికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు ఇది గుర్తింపు. బాలయ్య అభిమానులు మరియు సీనియర్ నటుడు మురళీమోహన్ అభిమానులు ఈ వార్తఉత్సాహాన్ని ఇస్తుంది.

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా పద్మ పురస్కారాల గ్రహీతల జాబితాను జనవరి 26న ప్రకటిస్తుంది. ఆ తరువాత రాష్ట్రపతి చేతుల మీద వీరందరికీ దశల వారీగా పురస్కారాలు రాష్ట్రపతి భవన్ లో అందిస్తారు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అంతకంటే ముందు ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. దాంతో చిరంజీవి సమకాలీనుడు అయిన బాలయ్యకు ఇంతవరకూ పద్మ పురస్కారాలు దక్కలేదని ఆయన అభిమానులు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ ఆవేదన తీరబోతుంది.

బాలకృష్ణ విషయానికి వస్తే..భారతదేశం లో ప్రఖ్యాత టాలీవుడ్ నటుడు మరియు నందమూరి తారక రామారావు (NTR) తనయుడు. తెలుగు సినీ పరిశ్రమలో “బాలయ్య”గా ఈయన్ను ముద్దుగా పిలుస్తుంటారు. 100కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించి ఇంకా మెప్పిస్తున్నారు. బాలకృష్ణ 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. బాలకృష్ణ యాక్షన్, డ్రామా, కామెడీ వంటి విభిన్నమైన పాత్రల్లో నటించి, తన ప్రత్యేకమైన శైలి ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. బాలకృష్ణ కేవలం సినిమాలు , రాజకీయాలే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన అనేక తాత్కాలిక కార్యక్రమాలను నిర్వహించి, అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుంటారు.

Read Also : Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి