Site icon HashtagU Telugu

Gopichand: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపిచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా, ఎప్పుడంటే

Gopichand Lucky Chance with Bhima

Gopichand Lucky Chance with Bhima

Gopichand: గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు.

భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రాబోతోంది.