Gopichand Viswam : గోపీచంద్ విశ్వంకు భారీ డీల్..!

Gopichand Viswam మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్ లో ఒక మంచి సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మాస్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ ఇటీవల బ్ భీమా

  • Written By:
  • Publish Date - June 21, 2024 / 10:40 PM IST

Gopichand Viswam మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్ లో ఒక మంచి సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మాస్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ ఇటీవల బ్ భీమా సినిమాతో వచ్చి జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది పక్కన పెడితే గోపీచంద్ మాస్ ఫ్యాన్స్ కి భీమా కాస్త జోష్ అందించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.

సౌత్ యాక్షన్ మూవీస్ ముఖ్యంగా మన తెలుగు మాస్ యాక్షన్ సినిమాలకు బాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలు బాలీవుడ్ వెళ్లి హీరోగా ట్రై చేసే క్రేజ్ వాటి వల్లే వచ్చింది. గోపీచంద్ సినిమాలకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది. గోపీచంద్ ఒకప్పటి మాస్ సినిమాలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి.

అందుకే గోపీచంద్ ప్రతి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతాయి. ఇక లేటెస్ట్ గా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న విశ్వం సినిమాకు కూడా 13 కోట్ల దాకా హిందీ డబ్బింగ్ ర్రైట్స్ రూపంలో వచ్చాయట. గోపీచంద్ కి ఇప్పుడున్న సక్సెస్ రేటుకి ఈ రేంజ్ డీల్ అంటే మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు. ఇక విశ్వం తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు గోపీచంద్. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో సక్సె అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

Also Read : Rashmika Mandanna : రష్మిక 13 కోట్లు.. ఈసారి నమ్మేయొచ్చా..?