Site icon HashtagU Telugu

Gopichand Malineni : మైత్రి మేకర్స్.. గోపీచంద్ మలినేని.. ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్..!

Gopichand Malineni Mytri Movie Makers Movie With Bollywood Hero

Gopichand Malineni Mytri Movie Makers Movie With Bollywood Hero

Gopichand Malineni  పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు అందుకుంటున్న తెలుగు మేకర్స్ తో పనిచేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ ని బీట్ చేసేలా టాలీవుడ్ సినిమాల ఫలితాలు ఉంటున్నాయి. అందుకే అక్కడ స్టార్స్ మన దర్శకులతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా అక్కడ షాహిద్, రణ్ బీర్ కపూర్ లతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగ సిద్ధం చేసుకున్నాడు.

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీర సిం హా రెడ్డి తర్వాత మరో సినిమా చేయలేదు. స్టార్స్ అంతా బిజీగా ఉండటం వల్ల హీరోలు దొరక్క ఖాళీగా ఉన్నాడు. రవితేజతో సినిమా ప్లాన్ చేసినా బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు.

Also Read : Samyukta Menon : డిస్ట్రర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న సంయుక్త.. క్రేజీ ఫోటో షూట్..!

లేటెస్ట్ గా గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో చేస్తాడని తెలుస్తుంది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో గోపీచంద్ సినిమా ఉండబోతుందని టాక్. ఈమధ్యనే గదర్ 2 తో తిరిగి ఫాంలోకి వచ్చిన సన్నీ డియోల్ గోపీచంద్ తో చేతులు కలుపుతున్నాడు. ఈ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ ఈ కాంబో ఎవరు ఊహించలేదు. ఈమధ్యనే యానిమల్ తో బాబీ డియోల్ సూపర్ ఫాం లోకి రాగా ఆయన వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు సన్నీ డియోల్ కు కూడా టాలీవుడ్ లక్కీ ఆఫర్ వస్తుంది. అయితే ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్వల్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.