Gopichand Bheema : గోపీచంద్ భీమా బిజినెస్ డీటైల్స్.. మ్యాచో స్టార్ మాస్ స్టామినా ఇది..!

Gopichand Bheema మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్షన్ లో వస్తున్న సినిమా భీమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్

Published By: HashtagU Telugu Desk
Gopichand Lucky Chance with Bhima

Gopichand Lucky Chance with Bhima

Gopichand Bheema మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్షన్ లో వస్తున్న సినిమా భీమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కన్నడలో వేద సినిమా తర్వాత గోపీచంద్ తో భీమా సినిమా చేస్తున్న హర్ష ఈ సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేశాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. గోపీచంద్ మార్క్ యాక్షన్ మూవీగా వస్తున్న భీమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో 14 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా గోపీచంద్ భీమా బిజినెస్ 16 కోట్ల దాకా చేసినట్టు తెలుస్తుంది. సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 16 కోట్ల పైన రాబట్టాల్సి ఉంటుంది. గోపీచంద్ దూకుడు చూస్తుంటే ఈసారి గట్టి హిట్టే కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.

  Last Updated: 29 Feb 2024, 08:59 PM IST