Site icon HashtagU Telugu

Manikandhan Gowri Priya True Lover Teaser : గుడ్ నైట్ మణికందన్ నుంచి ట్రూ లవర్.. టీజర్ ఇంప్రెసివ్..!

Good Night Hero Coming With True Lover Manikandhan Gowri Priya

Good Night Hero Coming With True Lover Manikandhan Gowri Priya

Manikandhan Gowri Priya True Lover Teaser ఈమధ్య ఓటీటీలో తెగ హడావిడి చేసిన గుడ్ నైట్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిద్రలో గురక పెట్టే వ్యక్తి లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఉంటాయో గుడ్ నైట్ సినిమాలో బాగా చూపించారు. ఆ సినిమా సౌత్ అన్ని భాషల్లో ఆడియన్స్ ని అలరించింది.

We’re now on WhatsApp : Click to Join

తెలుగులో కూడా గుడ్ నైట్ చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. గుడ్ నైట్ సినిమా హీరో మణికందన్ మరో సినిమాతో వస్తున్నారు. అదే లవర్. మలయాళంలో లవర్ అని వస్తున్న ఈ సినిమాను తెలుగులో ట్రూ లవర్ అని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మణికందన్ సరసన శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాను ప్రభురాం వ్యాస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని నజెరాత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను మారితి సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

లాస్ట్ ఇయర్ బేబీ లాంటి హిట్ అందుకున్న మారుతి, ఎస్.కె.ఎన్ మరోసారి ఈ ట్రూ లవర్ తో రాబోతున్నారు. ఈ సినిమా వాలెంటైన్ డే రోజు రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా రిలీజైన ట్రూ లవర్ టీజర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. చూస్తుంటే ఇది కూడా మరో బేబీ కథలా అనిపిస్తున్నా సినిమా తో మణికందన్ మరోసారి ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నారు.

Also Read : Varalakshmi Sharathkumar : మొన్న చిరు ఆ రేంజ్ లో పొగిడినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది.. మెగా బాస్ తో మరో లక్కీ ఛాన్స్..!

మెయిల్ సీరీస్ తో పాపులర్ అయిన గౌరి ప్రియ లాస్ట్ ఇయర్ వచ్చిన మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. మరి ఈ ట్రూ లవర్ కథకామీషు ఏంటన్నది ప్రేమికుల రోజు నాడు తెలుస్తుంది.