Kanguva: సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కంగువ టీజర్ వచ్చేస్తోంది

Kanguva : హీరో సూర్య అంటే వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువ,.దీని విడుదల కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య ప్రధాన పాత్రలో, దిశా పటాని హీరోయిన్ గా నటించారు, దర్శకుడు సిరుత్తై శివ గొప్ప ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సూర్య అభిమానుల కోసం సోమవారం  అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.  రేపు సాయంత్రం 04:30 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన […]

Published By: HashtagU Telugu Desk
Surya Kanguva Runtime Locked

Surya Kanguva Runtime Locked

Kanguva : హీరో సూర్య అంటే వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువ,.దీని విడుదల కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య ప్రధాన పాత్రలో, దిశా పటాని హీరోయిన్ గా నటించారు, దర్శకుడు సిరుత్తై శివ గొప్ప ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

సూర్య అభిమానుల కోసం సోమవారం  అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.  రేపు సాయంత్రం 04:30 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన సిజ్లింగ్ టీజర్ విడుదలవుతుందని బృందం ప్రకటించింది. ఈ టీజర్ ద్వారా సినిమా విడుదల తేదీని కూడా వెల్లడిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్‌ల సహకారంతో స్టూడియో గ్రీన్‌కు చెందిన కేఈ జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇది 3D మరియు IMAX ఫార్మాట్‌లతో సహా 38 భాషలలో విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఈ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

  Last Updated: 18 Mar 2024, 05:23 PM IST