Site icon HashtagU Telugu

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఆ హిట్ మూవీ రీరిలీజ్

Prabhas

Prabhas: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, SS రాజమౌళి మొదటిసారిగా 2005లో చత్రపతి కోసం కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. డార్లింగ్ కు మాస్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చేలా చేసింది. ఈ సినిమాలో శ్రియా శరణ్ కథానాయిక. పాన్-ఇండియన్ నటుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23, 2023న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం 4K వెర్షన్‌లో విడుదల కానుంది. బుకింగ్‌లు అతి త్వరలో తెరవబడతాయి.

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో భాను ప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తల్లి సెంటిమెంట్ ను ఈసినిమాలో చూపించాడు రాజమౌళి. ఈసినిమా ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఇక ఈసినిమా ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇటీవల ప్రభాస్ సినిమాలు వరుసగా అభిమానులను ఆశించినస్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీతోనైనా అభిమానులు రిలీఫ్ పొందాలని చూస్తున్నారు. కాగా రీరిలీజ్ ట్రెండ్స్ టాలీవుడ్ లో బాగా వర్కవుట్ అవుతుండటంతో ప్రభాస్ ఛత్రపతి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

Also Read: AP News: అనంతపురం జిల్లాలో అంబులెన్స్ ల కొరత, బైక్ పై బాలుడి శవం తరలింపు

Exit mobile version