Site icon HashtagU Telugu

NTR Hollywood: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జూనియర్ కు హాలీవుడ్ ఆఫర్!

Ntr

Ntr

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అద్భుత నటనతో కొమురం భీమ్ పాత్రకు జీవంపోశారు. ఆయన నటనకు పాన్ ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై ఓ హాలీవుడ్ (Hollywood) డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫేమ్ ఎన్టీఆర్ జూనియర్‌తో కలిసి పనిచేయాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను భారతీయ నటుడు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుకుంటునట్టు మనసులోని మాటను బయటపెట్టాడు.

ఎవరైనా భారతీయ నటుడిని పరిచయం చేయగలరా అని గార్డియన్స్ అడిగినప్పుడు పై విధంగా రియాక్ట్ అయ్యాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నటుడితో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందనీ, కూల్‌గా కనిపించారని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ స్టార్ నటుడ్ని తమ తమ సినిమాల్లో భాగం చేసుకోవాలని పెద్ద పెద్ద డైరెక్టర్స్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మార్వెల్ స్టూడియోస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మే 5న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ (NTR)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాతో ఆయన స్థాయి ఒక్కసారిగా ప్రపంచం నలుమూలలా విస్తరించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఈయన నటనకు హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించగా.. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు రావాల్సింది అంటూ తెగ కామెంట్లు చేశారు.

Also Read: Vishakha RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో దారుణం.. అర్ధనగ్నంగా మహిళ డెడ్ బాడీ!