Site icon HashtagU Telugu

Game Changer: హమ్మయ్య ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ విడుదల.. సాంగ్ రిలీజ్?

Mixcollage 06 Mar 2024 08 49 Am 6466

Mixcollage 06 Mar 2024 08 49 Am 6466

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు బోలెడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా దిల్ రాజు ఇప్పటివరకు నిర్మించిన సినిమాలలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్లు విడుదల చేయకపోవడంతో చెర్రీ అభిమానులు దర్శకుడు శంకర్ పై మండిపడుతున్నారు. ఒకటి రెండు అప్డేట్లు మినహా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ ని కూడా విడుదల చేయలేదు మూవీ మేకర్స్. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి తొలి పాటను విడుదల చేయనున్నారు.

త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 షూటింగ్ లో నిమగ్నం కావడంతో ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర ఆలస్యమైంది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంతకం చేయగా, ఈ పాన్ ఇండియా సినిమా మేలో ప్రారంభం కానుంది. ఎవరితో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హమ్మయ్య ఇప్పటికైనా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోంది అంటూ ఊపిరి పిలుచుకుంటున్నారు చెర్రీ అభిమానులు. ఇంకొందరు ఈ విషయంపై స్పందిస్తూ పోనీలే ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.