Vishwak Sen: మాస్ కా దాస్ ఫ్యాన్ కు గుడ్ న్యూస్.. త్వరలో ఫలక్ నుమా దాస్ 2

  • Written By:
  • Updated On - May 26, 2024 / 08:23 PM IST

Vishwak Sen:  విశ్వక్ సేన్ ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన చిత్రం ఫలక్ నుమా దాస్. ఈ చిత్రానికి దర్శకుడు, కథానాయకుడు కూడా ఆయనే. మూడేళ్ల క్రితం ఫలక్ నుమా దాస్ కు సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్ ఆ తర్వాత పెద్దగా అప్ డేట్స్ రాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ప్రమోట్ చేస్తూ ఫలక్ నుమా దాస్ 2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు విశ్వక్ సేన్.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ “నేను బొంబాయిలోని యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు నా హైదరాబాదీ హిందీని అందరూ ఎగతాళి చేసేవారు. ఫలక్ నుమా దాస్ ను తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా షూట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమాలో ఓ హైదరాబాదీ హీరో, హైదరాబాదీ హిందీ హీరో కనిపించనున్నారు.

కానీ అది హిందీ సినిమా. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో బిహారీ యాస, పంజాబీ యాస, భోజ్ పురి యాసను చూశాం కానీ హిందీ సినిమాలో ఎవరూ సరైన హైదరాబాదీ యాసను చూపించలేదు. సరైన హైదరాబాదీ హిందీ కుర్రాడిని ప్రేక్షకులు చూడాలి” అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ “బొంబాయి నుంచి వచ్చిన వారికి హైదరాబాదీ హిందీ నేర్చుకోవడం అసాధ్యం అని అన్నారు.