Annagaru Vastharu OTT కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’). ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న అనంతరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ చిత్రం (Annagaru Vostaru) ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
కథేంటంటే: ప్రముఖ నటుడు ఎంజీఆర్‌కు రాజ్ కిరణ్ వీరాభిమాని. ఎంజీఆర్ మరణించిన రోజే తనకు మనవడు పుడతాడు. దీంతో ఆ నటుడే తనకు మనవడిగా పుట్టాడని ఆ బిడ్డకు రామేశ్వరన్ (కార్తి) అనే పేరు పెడతాడు. ఎంజీఆర్ లక్షణాలతో నిజాయతీకి మారుపేరుగా పెంచాలని ప్రయత్నిస్తాడు. పోలీసుని చేస్తాడు. కానీ, తాత అంచనాలకు భిన్నంగా రామేశ్వరన్ పెరుగుతాడు. లంచాలు తీసుకుంటూ పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఓ ముఠాను రామేశ్వరన్ ఎన్‌కౌంటర్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో తాతకు కూడా తన నిజస్వరూపం తెలుస్తుంది. ఆ బాధ తట్టుకోలేక రాజ్ కిరణ్ చనిపోతాడు. ఆ తరువాత రామేశ్వరన్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మిగిలిన కథ.
