Site icon HashtagU Telugu

Kantara 2 confirmed: కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో ‘కాంతార 2’

Kantara Chapter 1

Kantara Chapter 1

ఏదైనా సినిమా (Movie) హిటై, ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తే కచ్చితంగా సీక్వెల్ మూవీని ఆశిస్తారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన కాంతార (Kantara) మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంతార ఫ్యాన్స్ సీక్వెల్ (Kantara 2) ఎప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ కు కాంతార టీం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కాంతార 2 కు సంబంధించిన పనులు స్టార్ట్ కాబోతున్నట్టు, మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలిపింది.

హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్, డెడ్‌లైన్‌తో ఇంటరాక్షన్‌లో, రిషబ్ శెట్టి (Rishab Shetty) ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. “షూట్‌లో కొంత భాగం వర్షాకాలం అవసరం కాబట్టి జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో సినిమాను పాన్-ఇండియా (Pan movie) విడుదల చేయాలనేది మా ఉద్దేశం” అని విజయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం, రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని అడవులకు వెళ్లి తన కాంతార చిత్రంలో చూపించిన జానపద కథల గురించి మరింత అర్థం చేసుకోవడానికి రెండు నెలలుగా రిసెర్చ్ చేస్తున్నాడు. అయితే కాంతార 2 (Kantara 2) బడ్జెట్‌ను పెంచారు కానీ సినిమా స్టైల్, కథనం సినిమాటోగ్రఫీ కాంతారాను పోలి ఉంటాయ. మొదటి సినిమాకు కొనసాగింపుగా, మరింత వాస్తవికతను జోడించేలా ఉండబోతుందని తెలిపారు. ఇక నటీనటులు కూడా ఎక్కువగా భాగమయ్యే అవకాశాలున్నాయి. కాంతార2 (Kantara 2) లో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా కనిపించవచ్చునని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించేవారికి మొదటి సినిమాతో పోలిస్తే ఎక్కువ రెమ్యునరేషన్ (Salaries) అందుకునే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి మొదటి సినిమాకి 4 కోట్లు పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది, అయితే అతను ప్రీక్వెల్‌తో రెండింతలు అందుకునే అవకాశం ఉందట. కాంతార రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా రిషబ్ శెట్టితో పాటు నిర్మాత హోంబలే ఫిల్మ్స్‌ని ఆశ్చర్యపరిచింది. కాంతార కన్నడలో (Kannada) విడుదలై విజయం సాధించాక హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం ఒక యాక్షన్-థ్రిల్లర్. కర్నాటక జానపద కథలో రూపుదిద్దుకుంది. రిషబ్ తో పాటు కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.

Also Read: Writer Padma Bhushan: ‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్ చూశారా!

Exit mobile version