Site icon HashtagU Telugu

Ram Charan: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఎంట్రీ ఇవ్వబోతున్న రాంచరణ్

Ipll

Ipll

Ram Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు స్టార్ హీరోగానే కాకుండా అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్‌ను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నాడు. పలు పెద్ద ప్రాజెక్టులను నిర్మించి ఒక నిర్మాతగా కూడా రాంచరణ్ పేరు తెచ్చుకున్నాడు. ఇక రాంచరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకుంటోంది. ఇందులో కూడా రాంచరణ్ భాగస్వామిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రాంచరణ్ మరో వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టనున్నాడనే ప్రచారం సాగుతోంది.

అదే ఐపీఎల్ ప్రాంచైజీ రంగంలోకి రాంచరణ్ అడుగుపెట్టనున్నాడని టాక్ నడుస్తోంది. ఒక ప్రాంచైజీని ఏర్పాట్లు చేసి ఐపీఎల్‌లో తన టీమ్ తరపున ప్లేయర్లను రంగంలోకి దిపనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉండగా… ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రాంఛైజీ లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రాంచైజీని ఏర్పాటు చేసి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాలని రాంచరణ్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని, వచ్చే ఏడాది నుంచి రాంచరణ్ ప్రాంచైజీ ఐపీఎల్ లోకి అడుగుపెడుతుందని అంటున్నారు.

ఈ టీమ్‌కు వైజాగ్ వారియర్స్ అనే పేరు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. దీనిని రాంచరణ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రాంచరణ్ ఐపీఎల్ ప్రాంచైజీ వార్తలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో రాంచరణ్ నటిస్తున్నాడు .ఈ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాకు కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో తన భార్య ఉపాసనతో రాంచరణ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.