Site icon HashtagU Telugu

Balakrishna: బాల‌య్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. అఖండ సినిమాకు సీక్వెల్

Balakrishna

Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఎన్బీకే 109 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. ఇక్కడ మరో అప్డేట్ బాలయ్య అభిమానుల ఆనందాన్ని మరింత పెంచడం ఖాయం. సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బిగ్గెస్ట్ మాస్ కాంబో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. రేపు ఉదయం 8:28 గంటలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

పవర్ ఫుల్ అఖండ సినిమాకు సీక్వెల్ కోసం ఈ రీయూనియన్ అని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. 14 రీల్స్ ప్లస్ భారీ బడ్జెట్ తో ఈ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మించనుంది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పూజా కార్యక్రమం జరుగుతుందని సమాచారం. తారాగణం, సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలు రేపు వెల్లడించే అవకాశం ఉంది. థమన్ మరోసారి బాలయ్యతో సినిమా చేస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.