Site icon HashtagU Telugu

Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?

Balakrishna

Balakrishna

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా బాలయ్య బాబు చివరగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join
దాంతో ఇప్పుడు అదే ఊపుతో బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడపుటున్నారు. అలాగే ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబు అభిమానులు సంతోషపడే ఒక వార్త వైరల్ అవుతోంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష అని టాక్ నడిచింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ప్రియమణి ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.

Also Read: Anasuya: నేను తెలంగాణ బిడ్డనే.. సింపతి అక్కర్లేదు.. ఘాటుగా రియాక్ట్ అయిన అనసూయ?

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణికి ఓకే చెప్పిందట టీమ్. ప్రియమణి గతంలో బాలయ్య సరసన మిత్రుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా తదితరులు నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తు్న్నాడు. ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి వీరమాస్ టైటిల్ లాక్ అయ్యిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్‌ను ఉగాది కానుకగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో ఒక మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేటెస్ట్ సినిమా అఖండకు సీక్వెల్‌గా రానుందని అంటున్నారు.

Also Read:Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?

Exit mobile version