సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరెర్ లో ఎనుకో వరుస సినిమాలు చేయట్లేదు. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినట్టుగానే అనిపించింది. ఐతే ఆ సినిమా తర్వాత అయినా అనుష్క వరుస సినిమాలు చేస్తుంది అనుకుంటే మళ్లీ ఎప్పటిలానే లేట్ చేస్తుంది.
ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న స్వీటీ మలయాళంలో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తుంది. కథనార్ (Kathanar) ది వైల్డ్ సోర్సరర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ ను రోజినా థామస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మలయాళంలో అడుగు పెడుతుంది.
ఫాంటసీ థ్రిల్లర్ కథ..
అనుష్క (Anushka) సినిమా షూటింగ్ పూర్తైనట్టు చిత్ర యూనిట్ వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని చెబుతున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథలకు మలయాళ పరిశ్రమ పెట్టింది పేరు. మరి అనుష్కతో వీరు ఎలాంటి సినిమా చేస్తున్నారన్నది చూడాలి.
అనుష్క సినిమాలో ఉంది అంటే కచ్చితంగా విషయం ఉంటుందని నమ్మే ఫ్యాన్స్ ఉన్నారు. మలయాళంలో తీసిన ఆ సినిమాను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి అనుష్క గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఓ పక్క క్రిష్ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. క్రిష్ తో అనుష్క ఆల్రెడీ వేదం సినిమా చేయగా స్వీటీతో మరో అదిరిపోయే కథతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో అనుష్క తిరిగి ఫాంలోకి వచ్చేస్తుందని చెప్పొచ్చు.
Also Read : Air India Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు