Pushpa 2 Release Date: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పుష్ప2 రిలీజ్ డేట్ ఫిక్స్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Pushpa 2

Pushpa2

Pushpa 2 Release Date: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం 2024 ఆగస్టు 15న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం (పుష్ప) ఇప్పటికే ఉత్తమ నటుడు జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను పోషించనున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న తిరిగి నటిస్తోంది.

పుష్ప: ది రైజ్ డిసెంబర్ 2021లో విడుదలైంది. ఆ సమయంలో సరైన హిట్స్ లేక ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ పుష్ప మూవీ ఎప్పుడైతే విడులైందో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా థియేటర్లు సందడిగా మారాయి.  ప్రేక్షకులను మళ్లీ వెండితెరపైకి తీసుకొచ్చిన ఘనత పుష్పకే దక్కుతుంది. 1990 ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అల్లు అర్జున్ పోషించిన పుష్ప.. స్మగ్లర్‌గా ఎలా మారుతాడు అనేది కథాంశం. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పష్ప, శ్రీవల్లి మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఊ అంటవా మామ, చూపే బంగారమాయేనే లాంటి పాటలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే ఫహద్ ఫాసిల్ పాత్రధారి భన్వర్ సింగ్ షెకావత్ పుష్ప ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత పుష్ప, షెకావత్ మధ్య ఆసక్తికర పోరు మొదలవుతుంది. ఫహద్ ఫాసిల్ పాత్ర పుష్పపై ప్రతీకారం తీర్చుకునే కథతో పార్ట్2 మొదలు కాబోతోంది. పాటలు, ఫైట్స్, కథ అన్ని విభాగాల్లో ఈ మూవీ ఆకట్టుకోవడంతో పుష్ప2 మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: MLC Kavitha: సీఎం కేసీఆర్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారు: ఎమ్మెల్సీ కవిత

  Last Updated: 11 Sep 2023, 05:20 PM IST