Nayanatara Premalu : స్టార్ హీరోయిన్ ను మెప్పించిన ప్రేమలు మూవీ.. సోషల్ మీడియాలో ఏం కామెంట్ పెట్టిందంటే..!

Nayanatara Premalu స్టార్ హీరోయిన్ నయనతార చాలా తక్కువ సినిమాలను తనకు నచ్చాయని చెబుతుంది. మరీ ముఖ్యంగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే ఆ సినిమా

Published By: HashtagU Telugu Desk
Super Hit Premalu Rejected by Small Screen Audience

Super Hit Premalu Rejected by Small Screen Audience

Nayanatara Premalu స్టార్ హీరోయిన్ నయనతార చాలా తక్కువ సినిమాలను తనకు నచ్చాయని చెబుతుంది. మరీ ముఖ్యంగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే ఆ సినిమా ఎంత బాగా నచ్చాలో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం నయనతార సోషల్ మీడియాలో గుడ్ ఫిలింస్ మేక్స్ మి హ్యాపీ అంటే మంచి సినిమాలు తనని సంతోషపరుస్తాయని కామెంట్ పెట్టింది.

ఇంతకీ నయనతార ఆ కామెంట్ ఏ సినిమాకు పెట్టిందో తెలుసా.. అదే మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమలు సినిమాకే. నెల్సన్, మమితా బైజు నటించిన ప్రేమలు సినిమా యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యాక తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.

తెలుగులో ప్రేమలు మంచి సక్సెస్ అందుకుంది దాదాపు తమిళంలో కూడా అదే రేంజ్ ఫలితాన్ని రాబట్టుకుంది. అయితే ఈ సినిమా చూసిన నయనతా మాత్రం మంచి సినిమాలు తనని హ్యాపీగా చేస్తాయని కామెంట్ పెట్టింది. స్టార్ హిరోయిన్ నయనతార చేసిన ఈ కామెంట్ ప్రేమలు టీం ను సర్ ప్రైజ్ చేస్తుంది.

ఈ సినిమా చూసిన తర్వాత యూత్ అంతా కూడా మమితా ప్రేమలో పడక మానరు. ప్రేమలు సినిమాతో మమితా బైజుకు సౌత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

  Last Updated: 18 Apr 2024, 02:23 PM IST