Site icon HashtagU Telugu

Geetanjali Malli Vacchindi : అంది వచ్చిన ఛాన్స్.. అందుకుంటారా.. వదిలేస్తారా..?

Good Chance for Anjali Geetanjali Malli Vacchindi Movie

Good Chance for Anjali Geetanjali Malli Vacchindi Movie

Geetanjali Malli Vacchindi ప్రతి శుక్రవారం తలరాతలు మారే సినీ పరిశ్రమలో స్టార్ సినిమాల లెక్క ఎలా ఉన్నా లో బడ్జెట్ నుంచి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు మాత్రం సినిమాలతో తమ ఫేట్ మర్చుకుంటారు. కంటెంట్ ఉన్న సినిమాలకు రిలీజ్ ఎప్పుడైనా సరే ప్రేక్షకుల నుంచి ఆమోదం లభిస్తుంది. కానీ రొటీన్ రెగ్యులర్ సినిమాలకు మాత్రం సరైన టైం చూసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే టాలీవుడ్ సమ్మర్ ని ఒక రేంజ్ లో ఊహించగా ఆశించిన విధంగా అయితే లేదని చెప్పొచ్చు.

డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అందుకోగా రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తేడా కొట్టేసింది. దేవర అనుకున్న డేట్ కి వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఒక రేంజ్ హిట్ అవుతుందని ఊహించిన ఆడియన్స్ కు అది షాక్ ఇచ్చింది. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫైట్ కు దిగుతున్నాయి. వాటిలో కాస్త క్యూరియాసిటీతో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది.

కోనా వెంకట్ రచన నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాను శివ తుర్లపాటి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం మంచి హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. అయితే ఈవారం బాక్సాఫీస్ రేసులో గీతాంజలితో పాటుగా విజయ్ ఆంటోని లవ్ గురు కూడా వస్తుంది.

బిచ్చగాడు, బిచ్చగాడు 2 తో సూపర్ హిట్లు అందుకున్న విజయ్ ఆంటోని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. వీటితో పాటుగా జీవీ ప్రకాష్ డియర్ సినిమా కూడా పోటీలో ఉంది. బాలీవుడ్ నుంచి మైదాన్, బడేమియా చోటే మియా కూడా ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ సినిమాల్లో టిల్లు స్క్వేర్ మాత్రమే కాస్త హడావిడి చేస్తుండగా మిగతా సినిమాలన్నీ ఖాళీ అయ్యాయి. సో గీతాంజలి 2 కి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

Also Read : NTR Devara : దేవర.. ఎన్టీఆర్ ప్రెస్టీజ్ గా తీసుకున్నాడా..?