Site icon HashtagU Telugu

GodFather 100 crore: 3 రోజుల్లో 100 కోట్లు.. దుమ్మురేపుతున్న గాడ్ ఫాదర్!

Godfather

Godfather

తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హిందీ బెల్ట్ లోనూ దూసుకుపోతోంది. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ‘గాడ్‌ఫాదర్‌’ రూ.100కోట్ల వసూళ్లు సాధించటంపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం గాడ్ ఫాదర్ మూవీ మలయాళం చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. చిరంజీవి ఇమేజ్ తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ను తెరకెక్కించారు. రిమేక్ కంటే తెలుగు మూవీ పదిరెట్లు బాగుందని మెగా అభిమానులు అంటున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇంద్ర, ఠాగూర్ సినిమాల తర్వాత అంతటి విజయాన్ని గాడ్ ఫాదర్ అందించిందని చిరంజీవి అన్నారు.