GOAT First Day Collection : విజయ్ (Hero Vijay) నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT). వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ మూవీ లో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు నటించారు. నిన్న ( సెప్టెంబర్ 5వ తేదీన ) వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేసారు. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులోను విజయ్(Vijay) తన మార్క్ ను చూపెట్టాడు. కాకపోతే లియో రేంజ్ బుకింగ్స్ మాత్రం దక్కలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడం తో వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో (GOAT First Day Collections) ఫస్ట్ డే రూ. 3 కోట్లను రాబట్టినట్లు సమాచారం. ఇక తమిళనాట రూ. 38.3 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 1.7 కోట్లను రాబట్టింది. ఓవరాల్ గా ఇండియాలో ఫస్ట్ డే రూ. 55 కోట్లకు పైగా గ్రాస్.. రూ. 43 కోట్లు నెట్ వసూళ్లను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 90 నుంచి 95 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ (GOAT Pre Release Business) చూస్తే..
వరల్డ్ వైడ్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 185 కోట్లు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 187 కోట్ల షేర్ సాధించాలి. అంటే రూ. 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లను విజయ్ రాబట్టాల్సి ఉంటుంది. తొలిరోజే దాదాపు వంద కోట్లు కొల్లగొట్టిన విజయ్.. వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also : Maruti Suzuki Swift CNG: ఎక్కువ మైలేజీనిచ్చే సీఎన్‌జీ కారుని లాంచ్ చేయనున్ను మారుతీ..!