Site icon HashtagU Telugu

Sitara Ghattamaneni: సితారను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. కేసు నమోదు?

Mixcollage 10 Feb 2024 07 51 Am 7358

Mixcollage 10 Feb 2024 07 51 Am 7358

రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమాయకమైన ప్రజలను టార్గెట్ చేసి రకరకాలుగా మోసాలకు పాల్పడుతూ వారి నుంచి పెద్ద ఎత్తులో డబ్బులను కాజేయడం లాంటివి చేస్తున్నారు. పోలీసు వారు సైబర్ నేరగాళ్లకు ఎప్పటికప్పుడుకి అడ్డుకట్టలు వేస్తున్నా కూడా కొత్త పుంతలు తొక్కుతూ ప్రజలను దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకుల ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది సైబర్ నేరగాళ్లు ప్రముఖుల సెలబ్రిటీల పేరుతో అకౌంటు క్రియేట్ చేసి భారీగా డబ్బులు లాగేస్తున్నారు. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపి దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు.

అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఇలా ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు వాడుకొని చాలామందిని మోసం చేయగా ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరును కూడా వాడుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ కొత్త మోసానికి తెర తీశారు. ఇన్ స్టాలో ట్రెండింగ్ లింక్స్ పంపి డబ్బులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో మహేష్ బాబు టీం రంగం లోకి దిగింది. ఈ మోసాలపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

ఎలాంటి అనుమానస్పద నోటిఫికెషన్స్ కు రిక్వెస్టులకు స్పందించవద్దని అభిమానులకు, నెటిజన్లకు మహేష్ టీం రిక్వెస్ట్ చేసింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులను హెచ్చరించారు. ఇకపోతే సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది సితార.

Exit mobile version