Naa Saami Ranga: నాగార్జున, ఆషికా రంగనాథ్ కాంబినేషన్ లో నాసామిరంగ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నా సామి రంగ నిర్మాతలు అదిరిపొయే అప్డేట్ ఇచ్చారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలో నటించాడు. అల్లరి నరేష్ ఆనందంలో డ్యాన్స్ చేయడంతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది.
నాగార్జునతో అతని స్నేహపూర్వక ప్రయాణాన్ని మనం చూడవచ్చు. పల్లెటూరి వాతావరణం, నాగార్జున మరియు అల్లరి నరేష్‌ల అందమైన బంధం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
Also Read: TSRTC: నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ