Getup Srinu : జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కమెడియన్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నాడు గెటప్ శ్రీను. ఇటీవల దేవర సినిమాలో ఎన్టీఆర్ ఫ్రెండ్ పాత్రలో సెకండ్ హాఫ్ లో కాసేపు కనిపించి అలరించాడు.
గెటప్ శ్రీను దేవర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివలతో కలిసి దిగిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలను షేర్ చేసి.. దేవర సినిమాలో ఒక చిన్నపాత్ర చేయడం, అదీ నాకు ఎంతోఇష్టమైన ఎన్టీఆర్ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందాన్నిచ్చింది. ఈ అవకాశాన్నిచ్చిన మా కొరటాల శివ సర్ కి ధన్యవాదాలు అని తెలిపారు.
ఇక దేవర సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినా వీకెండ్ కావడంతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లో దేవర సినిమా 304 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఎన్టీఆర్ అయితే దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు.
Also Read : Devara : దేవర మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?