Site icon HashtagU Telugu

Genelia D’Souza: టాలీవుడ్ లోకి జెనీలియా రీఎంట్రీ.. పదేళ్ల తర్వాత మళ్లీ!

Genelia

Genelia

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరొందిన జెనీలియా డిసౌజా చివరిసారిగా 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమాలో నటించింది. ఆమె చివరిగా తెలుగు సినిమాలో నటించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం కన్నడ-తెలుగు ద్విభాషా సినిమాతో జెనీలియా తెలుగులో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి తెరంగేట్రం చేయనున్నాడు.

జెనీలియా విషయానికి వస్తే.. ఈ ద్విభాషా చిత్రంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జెనీలియా పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయి. ‘పెళ్లి సందడి’ చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలాతో కిరీటి రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో కన్నడ సీనియర్ నటుడు రవిచంద్ర కూడా కనిపించనున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. భారీ అంచనాలున్న ఈ కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Exit mobile version