Site icon HashtagU Telugu

Game On : ఇంట్రెస్టింగ్ సైకాలజీ థ్రిల్లర్ గేమ్ కథతో ‘గేమ్ ఆన్’.. రిలీజ్ డేట్ అనౌన్స్..

Geethanand Neha Solanki New Thrilling Movie Game On Release Date Announced

Geethanand Neha Solanki New Thrilling Movie Game On Release Date Announced

యువ నటుడు గీతానంద్(Geethanand), నేహా సోలంకి(Neha Solanki) జంట‌గా న‌టించిన సినిమా ‘గేమ్ ఆన్‌’(Game On). క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంట్రెస్టింగ్ సైకాలజీ థ్రిల్లర్ గేమ్ కథతో తెరకెక్కుతున్న ఈ గేమ్ ఆన్ సినిమాని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో భాగంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ… గేమ్ ఆన్ సినిమా ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల చేయబోతున్నాం. ర‌థం సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ సినిమాలో హీరోగా నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్తాడు. హీరోయిన్ నేహ సోలంకి త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు ద‌యానంద్ క‌థ‌ చెప్పిన దానిక‌న్నా కూడా చిత్రాన్ని అద్భ‌తంగా తెర‌కెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా కోసం మంచి స్టార్‌ కాస్ట్ తీసుకున్నాం. ఈ సినిమాలో సీనియర్ నటి మధుబాల గతంలో ఎన్నడూ చేయని పాత్ర చేశారు. ‘కార్తికేయ 2’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటించాడు. మా సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాం అని అన్నారు.

అలాగే దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు.

 

Also Read : Tollywood : ‘బేబీ’ నిర్మాత ఇంట విషాద ఛాయలు