Mahesh Babu Son: నెక్ట్స్ సూపర్ స్టార్ కమింగ్.. ఫస్ట్ స్టేజీ షో లో ‘గౌతమ్’ అదుర్స్

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన మొదటి స్టేజీ షోలోనే ఆకట్టుకున్నాడు.

  • Written By:
  • Updated On - December 1, 2022 / 03:34 PM IST

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన మొదటి థియేటర్ షో అద్భుతంగా నటించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గౌతమ్ కూడా తండ్రిలా నటించి ఆశ్చర్యపర్చాడు. హైస్కూల్‌లో చదువుతున్న గౌతమ్ ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్‌పై వేసిన నాటకం నటించి అందర్నీ ఆకర్షించాడు. నమ్రత గౌతమ్ వీడియోను షేర్ చేసి, గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ఆమె తన అబ్బాయిపై ప్రేమను కురిపించి ” గౌతమ్ పెద్దగా థియేటర్స్ లో ఎక్స్ పర్ట్ కాడు. GG హైస్కూల్‌లో మొదటి థియేటర్ ప్రొడక్షన్ లో స్టైల్‌గా నటించాడు. అద్భుతంగా యాక్ట్ చేసి ఆశ్చర్యపర్చాడు. ఈ వీడియోను నేను చూడకుండా ఉండలేను’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో గౌతమ్ వీడియోకు ఎన్నో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ‘నెక్స్ట్ సూపర్ స్టార్’, ‘ప్రిన్స్ ఇన్ ది మేకింగ్’ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. గౌతమ్ గతేడాది 10వ తరగతి ఉత్తీర్ణుడై ప్రస్తుతం ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్నాడు. గౌతమ్ లుక్స్ లోనే కాదు పర్సనాలిటీలో కూడా తన తండ్రి లాంటి వాడు. ఇక ఎత్తు విషయంలో మహేశ్ కు ఏమాత్రం తీసిపోడు.

ఇటీవల సూపర్‌స్టార్ కృష్ణను కోల్పోవడంతో ఘట్టమనేని కుటుంబం వరుష విషాదాలను చవిచూసింది. ఆయన పెద్దకర్మ 11వ రోజున నిర్వహించడంతో మహేశ్ ప్యామిలీ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 32 రకాల ఆహార పదార్థాలు అభిమానులకు వడ్డించినట్లు సమాచారం. ఇక రమేశ్ బాబు కుమారుడు లుక్స్ కూడా బయటకు రావడంతో, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.