Gautham Ghattamaneni: సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్ కూడా యాక్టింగ్‌లో సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నారు. ఇటీవలే తన తోటి స్నేహితులతో కలిసి ఒక మైమ్ (మూగ నాటిక)లో గౌతమ్ చక్కగా నటించారు. ఈ నాటికలో గౌతమ్, ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేశాడు. తొలుత నవ్వుతూ.. ఆ తర్వాత కోప్పడుతూ ఎమోషన్స్ బాగానే పండించాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. మొత్తం మీద నటనపై తనకు ఆసక్తిని గౌతమ్ స్పష్టంగా బయటపెడుతున్నారు.
#GautamGhattamaneni shines at NYU Tisch School of the Arts! His latest act with his mates is winning hearts. Wishing him the best on this creative journey! ✨🎭 #MaheshBabupic.twitter.com/6nkLVztKLw
— Milagro Movies (@MilagroMovies) March 20, 2025
లండన్‌లో తొలి స్టేజ్ షో
కొంతకాలం క్రితం లండన్‌లో గౌతమ్ తొలి స్టేజ్ షో ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘గౌతమ్ మొట్టమొదటి థియేటర్ స్టేజ్ ప్రదర్శన చాలా బాగుంది. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్ ఆఫ్ డ్రామా’ నిర్వహించే సమ్మర్ ప్రోగ్రామ్ ఎంతగానో యూజ్ అవుతుంది’’ అని నమ్రత రాసుకొచ్చారు. గతంలో మహేశ్‌బాబు(Gautham Ghattamaneni) నటించిన ‘వన్ నేనొక్కడినే’ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్ యాక్ట్ చేశారు.
Also Read :Campa Vs Pepsi Coke : అంబానీ దెబ్బకు దిగొచ్చిన పెప్సీ, కోకకోలా.. రూ.10కే ఆ డ్రింక్స్
కొన్ని నెలల క్రితమే
మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార పాల్గొన్నారు. ఆసందర్భంగా కుమారుడు గౌతమ్‍ను అభినందిస్తూ ఇన్‍స్టాగ్రామ్ వేదికగా అప్పట్లో మహేశ్ బాబు పోస్ట్ చేశారు. ‘‘చదువుల్లో రాణిస్తున్న గౌతమ్‌ను చూసి తండ్రిగా గర్విస్తున్నా. నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నీకు అభినందనలు. తర్వాతి ఛాప్టర్ నువ్వే రాసుకోవాల్సి ఉంటుంది. ముందుకంటే ఇంకా మెరుగ్గా ఉంటావని నాకు తెలుసు. నీ కలలను ఛేదిస్తూనే ఉండు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటామని గుర్తుంచుకో. నేను నేడు గర్విస్తున్న తండ్రిని’’ అని ఆ పోస్ట్‌లో గౌతమ్ గురించి మహేశ్ బాబు రాసుకొచ్చారు.ఇక మహేష్ బాబు కుమార్తె సితార కూడా పలు యాడ్స్‌లో నటిస్తోంది. సితార డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మహేశ్ బాబుతో కలిసి ఓ దుస్తుల బ్రాండ్ యాడ్‌లో సితార మెరిసింది.