Gautam Ghattamaneni : మహేష్ బాబుతో పాటు అతని పిల్లలు సితార, గౌతమ్ కూడా బాగా పాపులర్ అని తెలిసిందే. సోషల్ మీడియాలో సితార రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటే గౌతమ్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటాడు. సితార, గౌతమ్ ల ఫొటోలు, వీడియోలు వస్తే ఫ్యాన్స్ వాటిని తెగ షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన పలు ఫొటోలు షేర్ చేసాడు. ప్రస్తుతం గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో చదువుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు. యాక్టింగ్, సినిమాకు సంబంధించిన పలు క్రాఫ్ట్స్ గురించి ఈ కోర్స్ ఉండబోతుంది.
అక్కడ యూనివర్సిటీకి చెందిన హాస్టల్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు గౌతమ్. తాజాగా ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవ్వగా అమెరికాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు గౌతమ్ అని పలువురు కామెంట్స్ చేయగా, మరికొందరు త్వరగా కోర్స్ కంప్లీట్ చేసి వచ్చి హీరోగా ఎంట్రీ ఇవ్వు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Shanmukh Jaswanth : హీరోగా మారుతున్న షన్ను.. వెండితెరపై మెప్పిస్తాడా..?