Site icon HashtagU Telugu

RGV: అనుష్క గ్లామర్ పై గరికపాటి కామెంట్స్…ఆర్జీవీ ఊరుకుంటాడా..!!

Garikapati

Garikapati

అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి గెస్టులుగా వచ్చిన చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య చోటుచేసుకున్న ఘటన వివాదాలకు దారి తీసింది. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మెగా అభిమానులు గరికపాటిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఈ వివాదంలోకి తలదూర్చాడు రాంగోపాల్ వర్మ. గరికపాటిని తప్పుబట్టారు. ఆయన్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరొక ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఈ ట్వీట్ లో గరికపాటి గతంలో అనుష్క గ్లామర్ గురించి మాట్లాడిన వీడియో షేర్ చేశారు. హీరోయిన్లను కుర్రాళ్లు తెగ చూస్తేస్తారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని..కానీ నా చూపు కూడా ఒక చోట ఆగిపోయింది. అది ఎవరో కాదు మహానటి అనుష్క. అంటూ అనుష్క గ్లామర్ గురించి గరికపాటి ప్రస్తావించారు.

గరికపాటి సరదాగా చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ…ఆహా ఓహో అంటూ ట్వీట్ చేశారు. ఛాన్స్ దొరికితే చాలు గరికపాటి దుమ్ముదులిపేందుకు ఆర్జీవీ రెడీగా ఉన్నారు.

Exit mobile version