Site icon HashtagU Telugu

Gangs of Godavari :’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పబ్లిక్ టాక్

Gangs Of Godavari Talk

Gangs Of Godavari Talk

విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ఈరోజు ( మే 31 ) గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేయగా…రీసెంట్ గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Gangs of Godavari Pre Release Event ) కు బాలకృష్ణ హాజరై సందడి చేయడం..కొన్ని సంఘటనలు వివాదస్పదం కావడం తో గ్యాంగ్స్ అఫ్ గోదావరి కి మరింత క్రేజ్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

లంక గ్రామాల్లోని హింస‌పై పోరాడిన ఓ యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు చెబుతున్నారు.. విశ్వ‌క్‌సేన్ వాయిస్ ఓవ‌ర్‌తోనే ఈ మూవీ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు మిగిలిన ఇంట‌ర్వెల్‌ ఫైట్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఆడు మొద‌టి మూడు పోట్లు అమ్మోరికి వ‌దిలేశాడు అయ్యా…లాంటి డైలాగ్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ‌తాయ‌ని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

యాక్ష‌న్‌, కామెడి పాత్రల్లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుంద‌ని , విశ్వక్ లోని మాస్ కోణాన్ని కొత్త యాంగిల్‌లో చూపించిన సినిమా ఇద‌ని అంటున్నారు. . బుజ్జి పాత్రలో నేహాశెట్టి న‌ట‌న బాగుంద‌ని, ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ఆమె చూపించిన వేరియేష‌న్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కథ కొత్తగా లేకపోయినా టేకింగ్ బావుందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా సినిమాను ఫాస్ట్ ట్రాక్‌లో, రేసీ స్క్రీన్‌ప్లేతో తీసుకెళ్లారని చెబుతున్నారు. అసలు ఎక్కడా చిన్న ల్యాగ్ కూడా లేదంటున్నారు. అందులోనూ రా అండ్ రస్టిక్‌గా సినిమా ఉందని, మాస్ డైలాగ్స్ అదిరిపోయాయంటూ మరికొంతమంది యూజర్లు చెబుతున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా బీజీఎమ్ సినిమాకు ప్రాణం పోసింద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ రావడం తో మేకర్స్ హ్యాపీ గా ఉన్నారు.

Read Also : Warning Signals For India: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన బ్రియాన్ లారా.. ఎందుకంటే..?