Gangs of Godavari: రెండో రోజు తగ్గిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు

  • Written By:
  • Updated On - June 2, 2024 / 09:42 PM IST

Gangs of Godavari: కృష్ణచైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నేహాశెట్టి, అంజలి జంటగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. 2024 మే 31న విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేసినప్పటికీ మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పీఆర్ రిపోర్టుల ప్రకారం ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ.12.1 కోట్లు వసూలు చేసింది.

అయితే మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు దాదాపు రూ.4 కోట్లు తగ్గడంతో ఈ సినిమా లాంగ్ టర్మ్ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాయికుమార్, గోపరాజు రమణ, ఆయేషాఖాన్, హైపర్ ఆది తదితరులు నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.