Site icon HashtagU Telugu

Salman Khan Ganesh Puja: సల్మాన్ క్షేమం కోసం తల్లి సల్మా ‘గణేష్ పూజలు’

Salman

Salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వినాయకుడి వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. అంతేకాదు.. ప్రతి సంవత్సరం తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తాడు. సల్మాన్ పూజలు చేయడమే కాకుండా ఇతర నటులను కూడా ఇన్వైట్ చేస్తుంటాడు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా గతేడాది వేడుకల్లో పాల్గొనలేకపోయాడు. సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో జరగనున్న ఈ ఏడాది వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

సల్మాన్ ఖాన్ ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోబోతున్నాడు. కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే సల్మాన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో గన్ లైసెన్స్ కూడా పొందాడు. అయితే సల్మాన్ క్షేమంపై తల్లి ఒకింత ఆందోళన వ్యక్తి చేసింది. తన కొడుకుకు మంచి జరగాలని కోరుతూ సల్మాన్ తో కలిసి పూజలు చేయనుంది. గణపతి బప్పా చెడు నుండి రక్షిస్తాడని సల్మాన్ ఖాన్ తల్లి బలంగా నమ్ముతోంది. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు పట్ల గౌరవంగా ఉంటాడు. షూటింగ్స్ బిజీగా ఉన్నా నిత్యం తల్లిదండ్రులను కలుస్తుంటాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో కొడుకు క్షేమం కోసం తల్లి ప్రత్యేక పూజలు ఆసక్తిగా మారనుంది.

Exit mobile version