Site icon HashtagU Telugu

Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్ టాక్ ..

Gandeevadhari Arjuna Teaser

Gandeevadhari Arjuna Teaser

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి వస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 25 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. అలాగే, నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా పోస్టర్స్ , ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకోగా..ఈరోజు సోమవారం సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ (Gandeevadhari Arjuna Teaser) ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు మేకర్స్. టీజర్ లో ఓ మిషన్ కోసం ఏజెంట్ అయిన హీరోను రంగంలోకి దింపుతున్నట్లుగా చూపించారు. హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మిషన్ ఎలా నడిచింది అనే కాన్సెప్టుతో దీన్ని కట్ చేశారు. టీజర్‌ చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయని , యాక్షన్ ప్రియులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని అర్ధం అవుతుంది. అలాగే వరుణ్ తేజ్ (Varun Tej Look) లుక్స్, గ్రాండ్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ టీజర్‌లో లక్షల కోట్లు బిజినెస్ అంటూ చెప్పి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. టీజర్ ఓ రేంజ్ లో కట్ చేసిన డైరెక్టర్..సినిమా ను కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారా..లేదా అనేది చూడాలి.

Read Also : Priya Varrier : ప్రియా వారియర్ హాట్ బికినీ పిక్స్