ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంత ఊహించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ డైరెక్షన్ , దిల్ రాజు నిర్మాణం అనగానే సినిమా పై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథలో కొత్తదనం లేకపోవడం , సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం , సాగదీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి.
Kerala Shocker : అథ్లెట్‌పై అమానుషం.. ఐదేళ్లలో 60 మంది లైంగిక వేధింపులు
ఇదిలా ఉంటే టాక్ తో సంబంధం లేకుండా సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా (Game Changer Collections) ఏకంగా రూ.186 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ అధికారిక ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్బస్టర్ అంటూ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు రావడం జరిగింది. దీని బట్టి చూస్తే అల్లు అర్జున్ కంటే చరణే తక్కువ వసూళ్లు చేసాడు.