గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది.
ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా..శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10 న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఇక ఈ భారీ మూవీ ని ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై చరణ్ స్పందించారు.
Balayya : ‘డాకు మహారాజ్’ మూడు చోట్ల ప్రీ రిలీజ్ వేడుకలు
‘‘గేమ్ చేంజర్’ మూవీ నా హృదయానికెంతో దగ్గరైన చిత్రం. శంకర్‌గారితో కలిసి ఈ సినిమా కోసం పని చేయటం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఐమ్యాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని తెలియటంతో నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు. కేవలం చరణ్ మాత్రమే కాదు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు చాల ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మరి RRR తర్వాత చరణ్ నుండి వస్తున్న ఈ భారీ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.