Ram Charan: గేమ్ చేంజర్ కోసం వైజాగ్ కి చెర్రీ.. ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయిన ఎయిర్ పోర్ట్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా మొదలైంది చాలా రోజులవుతున్నా కూడా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ఎటువంటి […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Mar 2024 10 19 Am 828

Mixcollage 15 Mar 2024 10 19 Am 828

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా మొదలైంది చాలా రోజులవుతున్నా కూడా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నేటి నుంచి అనగా మార్చి 15 నుంచి వైజాగ్ లో జరగనుంది.

ఆర్‌కె బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ జరగబోతుంది. ఈ క్రమంలోనే బీచ్ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా నిర్మించారు. ఇక ఈ షూటింగ్ కోసం మూవీ టీం అంతా నిన్ననే వైజాగ్ చేరుకుంది.రామ్ చరణ్, శంకర్, ఎస్‌జె సూర్యతో పాటు ఈ షెడ్యూల్ లో పాల్గోవల్సిన మరికొందరు నటీనటులు కూడా వైజాగ్ చేరుకున్నారు. ఇక రామ్ చరణ్ వస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు సందడి మొదలయింది. నిన్న సాయంత్రం నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం ఎదురు చూపులు చూసారు. దీంతో ఎయిర్ పోర్ట్ అంతా రామ్ చరణ్ అభిమానులతో కోలాహలంగా మారింది.

 

అంతేకాకుండా రాంచరణ్ అభిమానులతో ఏర్పోర్ట్ మొత్తం కిక్కిరిసిపోయింది. జై చరణ్, జై జై చరణ్ అంటూ తెగ గోల చేసేసారు. ఇక ఎయిర్ పోర్ట్ వద్ద రామ్ చరణ్ భారీ అభిమానాన్ని చూసిన ఎస్‌జె సూర్య షాక్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వెళ్లకుండా, కాసేపు వచ్చిన భారీ అభిమానులను చూస్తూ అలా నిలుచుండి పోయారు.

 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ షెడ్యూల్ షూటింగ్ మార్చి 19 వరకు జరగనుంది. ఆ తరువాత మార్చి 20న రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చి RC16 మూవీని పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మే నెల లోపు ఈ మూవీ షూటింగ్ ని పూర్తీ చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

  Last Updated: 15 Mar 2024, 10:22 AM IST