గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంత ఊహించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ డైరెక్షన్ , దిల్ రాజు నిర్మాణం అనగానే సినిమా పై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథలో కొత్తదనం లేకపోవడం , సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం , సాగదీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి. దీంతో సంక్రాంతి బరిలో నిలువలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ నాల్గు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది.
Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ
తొలి రోజు రూ. 51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా రూ.21.6కోట్లు, రూ.15.9కోట్లు,రూ.7.65కోట్లు, రూ.10 కోట్లు వసూలు చేసిందని ఇండియా టుడే పేర్కొంది. మొత్తం నెట్ వసూళ్లు రూ.106.15 అని పేర్కొంది. ఈ మూవీ తో పాటు సంక్రాంతి బరిలో నిల్చున్న డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రాణిస్తున్నాయి.