Indian 2 : శంకర్ అండ్ కమల్ హాసన్ తమ సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా భారతీయుడు 2ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ చిత్రం మొదటి భాగం స్థాయిలో లేకపోవడంతో.. ప్రేక్షకులు నిరాకరించారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కనీస కలెక్షన్స్ కూడా రాబట్టడానికి ఇబ్బందులు పడుతుంది. సినిమా చూసిన 90’s ఆడియన్స్ అయితే.. అసలు ఇది శంకర్ స్థాయి సినిమా కాదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజల్ట్ ని శంకర్ ఫ్యాన్స్ అసలు అంచనా వేయలేదు.
అయితే ఈ రిజల్ట్ ని నిర్మాత దిల్ రాజు మాత్రం ముందుగానే అంచనా వేసినట్లు కనిపిస్తుంది. భారతీయుడు 2 సినిమాని లేక ప్రొడక్షన్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నిర్మాణ భాద్యతలను ముందుగా దిల్ రాజు తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ తో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 2017 సెప్టెంబర్ లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని తన బ్యానర్ లో రాబోయే సినిమాగా ప్రకటించారు. కానీ ఒక నెల తరువాత ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
అందుకు గల అసలు కారణం ఏంటనేది దిల్ రాజు అప్పుడు తెలియజేయలేదు. అయితే ఆ కారణం ఏంటనేది ఇప్పుడు అర్ధమవుతుంది. సినిమా కథలు పై మంచి గ్రిప్ ఉన్న దిల్ రాజు.. ఇండియన్ 2 రిజల్ట్ ని ముందుగానే అంచనా వేసి నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఆ మూవీ నుంచి తప్పుకున్న దిల్ రాజు నాలుగేళ్ళ తరువాత శంకర్ దర్శకత్వంలోనే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ని అనౌన్స్ చేసారు. గేమ్ ఛేంజర్ కి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథని అందించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. మరి దిల్ రాజు తీసుకు ఈ ఛేంజ్.. తన గేమ్ కి విజయం అవుతుందా, లేదా..? అనేది చూడాలి.