Site icon HashtagU Telugu

Game Changer Event: మెగా అభిమానుల‌కు డబుల్ బొనాంజా.. ఒకే వేదిక‌పై ప‌వ‌న్‌, రామ్‌ చ‌ర‌ణ్‌

Game Changer Event

Game Changer Event

Game Changer Event: రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ (Game Changer Event) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది. పొలిటిక‌ల్ డ్రామాగా శంక‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఒక్క‌టి నాయ‌కుడిగా కాగా రెండో ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్రలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. ఇక‌పోతే ఈ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హిస్తోంది. ట్రైల‌ర్ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని ముఖ్య అతిథిగా పిలిచిన నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాత్రం భారీ స్థాయిలోనే చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌న‌వ‌రి 4వ తేదీన రాజ‌మండ్రిలోని వేమ‌గిరిలో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రుకానున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను శ్రీవెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేసింది. ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వ‌స్తున్న‌ట్లు ఓ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీంతో మెగా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకే వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చూడబోతున్నందుకు సంతోషంగా ఉంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Savitribai Phule : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపు ఉమెన్ టీచర్స్ డే..!

ఈ ఈవెంట్‌కు ప‌వ‌న్‌తో పాటు మెగా కుటుంబంలోని హీరోలు సైతం అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజ‌ర్ మూవీ జ‌న‌వ‌రి 10వ తేదీన సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇక‌పోతే ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి కియ‌రా అద్వానీ, తెలుగు న‌టి అంజ‌లి న‌టించారు. వీరితో పాటు న‌టులు శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, సునీల్‌, బ్ర‌హ్మానందం, జ‌యరామ్, అలీ, న‌వీన్ చంద్ర‌, త‌దితరులు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీకి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వహారిస్తున్నారు.