నెలలోపే ఓటీటీలోకి గేమ్ ఛేంజర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ థియేటర్స్ లలో విడుదలైంది. కానీ మొదటి ఆట తోనే మిక్సెడ్ టాక్ రావడం ఇదే క్రమంలో పైరసీ ప్రింట్ రావడం తో సినిమా పై ఎఫెక్ట్ భారీగా పడింది.
Davos : బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ..అప్పుడు IT ..ఇప్పుడు AI
టాక్ తో పాటు ప్రింట్ కూడా వచ్చేయడం, ఇదే క్రమంలో సంక్రాంతి బరిలో వచ్చిన డాక్ మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్ టాక్ రావడం తో జనాలంతా ఆ సినిమాలే చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. దీంతో సంక్రాంతి బరిలో డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ని OTT లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ అక్షరాల రూ.155 కోట్లకు కొనుగోలు చేసిందిన టాక్. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకరాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఆ డేట్ నే స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది చూడాలి.