‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై మెగా (Mega Fans) అభిమానుల్లో, తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రామ్ చరణ్ (Ramcharan) పాత్రను ఆయన గత చిత్రాల కంటే పూర్తిగా కొత్తగా, విభిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇందులో చరణ్ లీడ్ రోల్ లో ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మేకర్స్ సినిమా ప్రమోషన్లపై దృష్టి సారించారు. మొదటి నుండి ప్రమోషన్లు సరిగా చేయడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉండగా..ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో వరుస అప్డేట్స్ , ఈవెంట్స్ తో సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సినిమాలోని ‘నానా హైరానా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసారు. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. తమిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా ఈ పాట ప్రేక్షకులను సమ్మోహనపరుస్తోంది. ఈ పాటను తెలుగులో రామజోగయ్యశాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌశర్ మునీర్ రాశారు. ఈ పాటకు సంబంధించిన బీటీఎస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
మేకింగ్ విషయానికి వస్తే, శంకర్ తనకు తానే సాటి అని మరోసారి ‘నా నా హైరానా’ పాటతో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాటను ఇప్పటివరకు ఎవరూ చిత్రీకరించని విధంగా ‘రెడ్ ఇన్‌ఫ్రా’ కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీతో ఈ పాట మనసుని తేలిక పరుస్తోంది. మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతీ ఫ్రేమ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీగా ట్యూన్ చేశారు. ఇక రాజమండ్రి లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release ) ను గ్రాండ్ గా నిర్వ్హయించేందుకు ప్లాన్ చేసినట్లు వినికిడి. జనవరి 4న ఈ వేడుక జరపబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (APdeputycm Pawankalayn) చీఫ్ గెస్ట్ గా వస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.
Read Also : Konda Surekha : మంత్రి కొండాసురేఖ కు భారీ షాక్