Games Changer : ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన “రా మచ్చా మచ్చా” సాంగ్‌కి అనంత శ్రీరామ్, వివేక్, కుమార్ లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్ అద్భుతంగా పాడిన ఈ పాట, గణేష్ ఆచార్య రూపొందించిన కొరియోగ్రఫీతో ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. ముఖ్యంగా, చరణ్ ఈ పాటలో ‘వీణ స్టెప్’ చేయడం, మెగాస్టార్ చిరంజీవి కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జానపద కళాకారుల ప్రత్యేకత
ఈ పాటలో వందలాది జానపద కళాకారులు పాల్గొనడం విశేషం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా ఈ పాటలో భాగమవడం, పాటకు మరింత హైప్ తెచ్చింది. ప్రతి అంశం ఈ సాంగ్‌కి అద్భుతమైన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది, అభిమానులు దీనిని ఎంతో ఆనందంగా వినిపిస్తున్నారు.
“గేమ్ చేంజర్” పై పెరుగుతున్న ఆసక్తి
ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ కావడంతో, “గేమ్ చేంజర్” మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ , తెలుగు నటి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
తమిళ స్టార్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “రా మచ్చా మచ్చా” సాంగ్ సక్సెస్‌తో, అభిమానుల మధ్య హైప్ మరింత పెరిగింది. తమన్ మ్యూజిక్, శంకర్ దర్శకత్వం, రామ్ చరణ్ నటన అన్నీ కలిపి, ఈ అంశాలు “గేమ్ చేంజర్”ని పెద్ద హిట్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ పేర్కొంది. అయితే.. 24 గంటల్లోనే ఈ సాంగ్ 19.5 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని, టాలీవుడ్‌లో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోలో ఒకటిగా నిలిచింది.
Read Also : HYDRA : హైడ్రాతో బీఆర్‌ఎస్‌కు మైలేజ్.. ఇంకా కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు..?