#Gamechanger : రేపు ‘గేమ్ ఛేంజర్’ నుండి ‘జరగండి’ సాంగ్ రిలీజ్

ఈ మూవీ నుండి 'జరగండి' అనే సాంగ్ రేపు చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల కాబోతుంది

Published By: HashtagU Telugu Desk
Jaragandi Song

Jaragandi Song

డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ‘జరగండి’ (Jaragandi ) అనే సాంగ్ రేపు చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల కాబోతుంది. కాగా ఆల్రెడీ ఈ సాంగ్ నెట్టింట లీక్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే సాంగ్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. నిజానికి ఇది గతేడాది ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతూ తీసుకొచ్చిన పోస్టరే ఇది. అందులో చరణ్ బ్యాక్ చూపించారు. ఈ తాజా పోస్టర్ లో బ్లూ డ్రెస్ లో అదిరిపోయే చరణ్ ఫ్రంట్ లుక్ రివీల్ చేశారు. జరగండి సాంగ్ తెలుగుతోపాటు తమిళం, హిందీల్లోనూ రాబోతోంది. కాగా మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరిగింది. దీని తాలూకా పిక్స్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది. ‘గేమ్ ఛేంజర్’లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Also : Delhi Metro: ఢిల్లీలో హై అలర్ట్‌.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేత

  Last Updated: 26 Mar 2024, 12:12 PM IST